భూమనపై రాజా సింగ్ ఆరోపణల్లో నిజం లేదు
హిందూ ధర్మాన్ని ఏపీ ముఖ్యమంత్రి జగన్ చాలా తక్కువగా చూస్తున్నారని
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్‌గా భూమన కరుణాకర్ రెడ్డిని నియమించింది. దీనిపై గోషా మహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ తీవ్ర విమర్శలు చేశారు. హిందూ ధర్మాన్ని ఏపీ ముఖ్యమంత్రి జగన్ చాలా తక్కువగా చూస్తున్నారని గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల అఫిడవిట్‌లో క్రైస్తవుడిగా పేర్కొన్న భూమా కరుణాకర్ రెడ్డిని టీటీడీ చైర్మన్‌గా జగన్ నియమించారని, ఇది అత్యంత దారుణమైన చర్య అని అన్నారు. టీటీడీ చైర్మన్‌గా హిందువులనే నియమించాలని డిమాండ్ చేశారు. అయితే తాను క్రిస్టియన్ అని భూమన కరుణాకర్ రెడ్డి ఎప్పుడూ చెప్పలేదు. భూమన కరుణాకర్ రెడ్డి తానే స్వయంగా క్రిస్టియన్ అని ఎన్నికల అఫిడవిట్‌లో వెల్లడించాడని వైరల్ అవుతున్న పోస్టుల్లో ఎటువంటి నిజం లేదు. కాబట్టి రాజా సింగ్ భూమన కరుణాకర్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలు సత్య దూరం. భూమన కరుణాకర్ రెడ్డి తాను క్రిస్టియన్ అని ఎన్నికల అఫిడవిట్ లో పేర్కొనలేదు.