నేడు డీజీపీగా బాధ్యతల స్వీకరణ

ఏపీ డీజీపీగా రాజేంద్ర నాధ్ రెడ్డి నేడు బాధ్యతలను స్వీకరించనున్నారు. ఆయన డీజీపీగా అదనపు బాధ్యతలను చేపట్టనున్నారు.

Update: 2022-02-19 01:58 GMT

ఆంధ్రప్రదేశ్ డీజీపీగా రాజేంద్ర నాధ్ రెడ్డి నేడు బాధ్యతలను స్వీకరించనున్నారు. ఆయన డీజీపీగా అదనపు బాధ్యతలను చేపట్టనున్నారు. డీజీపీగా ఉన్న గౌతం సవాంగ్ ను బదిలీ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఆయనకు ఏపీపీఎస్సీ ఛైర్మన్ పోస్టు ఇవ్వాలని నిర్ణయించింది. ఆ పోస్టులో ఉండాలంటే గౌతం సవాంగ్ తన సర్వీస్ కు రాజీనామా చేయాల్సి ఉంటుంది. మరో ఏడాదిన్నర పాటు గౌతం సవాంగ్ కు సర్వీసు ఉంది. దీంతో ఆయన ఉద్యోగానికి రాజీనామా చేస్తారా? లేదా? అన్నది ఆసక్తికరంగా మారింది.

కడప జిల్లాకు చెందిన...
మరోవైపు నేడు రాజేంద్ర నాధ్ రెడ్డి డీజీపీగా బాధ్యతలను స్వీకరిస్తున్నారు. రాజేంద్ర నాధ్ రెడ్డిది కడప జిల్లా. 1992కు చెందిన రాజేంద్ర నాధ్ రెడ్డి తొలుత నిజామాబాద్ జిల్లా బోధన్ ఏఎస్సీగా పనిచేశారు. అక్కడి నుంచి తెలంగాణలో వరంగల్, జనగాం ఏఎస్పీగా పనిచేశారు. అనంతరం విశాఖ రూరల్ ఎస్పీగా పనిచేశారు. రైల్వే ఎస్సీగా కూడా పనిచేశారు. ప్రస్తుతం ఆయన ఇంటలిజెన్స్ చీఫ్ గా ఉన్నారు.


Tags:    

Similar News