క్షమాపణ చెప్పిన తర్వాతే అడుగు పెట్టాలి

ఆంధ్రులను తరమికొడతానన్న కేసీఆర్ ఏ ముఖం పెట్టుకుని ఏపీలోకి వస్తున్నారని రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు అన్నారు

Update: 2023-01-03 06:07 GMT

ఆంధ్రులను తరమికొడతారన్న కేసీఆర్ ఏ ముఖం పెట్టుకుని ఏపీలోకి వస్తున్నారని బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కేసీఆర్ క్షమాపణ చెప్పిన తర్వాతనే ఏపీలోకి అడుగు పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. ఏపీ ప్రజలను తిట్టిన కేసీఆర్ కు ఆంధ్రలో ఏం పని జీవీఎల్ నరసింహారావు ప్రశ్నించారు. ఆంధ్రపార్టీల నాయకత్వం వద్దన్న కేసీఆర్ ఇప్పుడు అక్కడ పనేంటని నిలదీశారు.

అధికారం కోల్పోవడం ఖాయం...
తెలంగాణలో బీఆర్ఎస్ అధికారాన్ని కోల్పోవడం ఖాయమని ఆయన అన్నారు. తెలంగాణలో తన ప్రాభవాన్ని కోల్పోవడంతో జాతీయ పార్టీ అంటూ కేసీఆర్ కొత్త రాగం అందుకున్నారని ఆయన అన్నారు. తెలంగాణలో ఉన్న సమస్యలను ముందు పరిష‌్కరించాలని, తర్వాత ఆంధ్రను ఉద్ధరించేందుకు రావాలని ఆయన కోరారు.


Tags:    

Similar News