జగన్ ప్రభుత్వంపై కేవీపీ ఆగ్రహం.. వైఎస్ బొమ్మ పెట్టుకుని మరీ
ప్రధాని మోదీ దర్శనం దొరికినందుకు ముఖ్యమంత్రి జగన్ కు అభినందనలు తెలపాలని మాజీ రాజ్యసభ సభ్యులు కేవీపీ రామచంద్రరావు అన్నారు
ప్రధాని మోదీ దర్శనం దొరికినందుకు ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు అభినందనలు తెలపాలని మాజీ రాజ్యసభ సభ్యులు కేవీపీ రామచంద్రరావు అన్నారు. ఇతర రాష్ట్రాల కంటే ఎక్కువ సార్లు ఢిల్లీ వెళ్లిన ముఖ్యమంత్రి జగనేనని అన్నారు. ఇసుక, మద్యం కుంభకోణం లో దేశంలో చాలా మంది నేతలు అరెస్టు అయ్యారు కానీ ఏపీలోని నేతలకు మాత్రం మినహాయింపు కలిగించారన్నారు. బిజెపి దృష్టిలో దేశంలో ఎలాంటి మరక లేని ప్రభుత్వం ఏపీ ఒక్కటే అనుకుంటానని ఎద్దేవా చేశారు. ఏపీ లోని ఏ మంత్రి, ఎంపిల పైనా కేసులులేవని, అరెస్టులు ఎందుకు లేవో బిజెపి చెప్పాలని కేవీపీ కోరారు. దేశం అంతా నగదు రహిత లావాదేవీలు ఉన్నా ఏపీ లో మాత్రం అంతా నగదు తోనే విక్రయాలు జరిగినా కేంద్రం పట్టించుకోదని అన్నారు.
అంత అవినీతి జరుగుతున్నా...
వైఎస్ బొమ్మ పెట్టుకుని ఓట్లు అడగడానికి వెళ్తున్న వైసిపి నేతలకు సిగ్గు లేదన్న కేవీపీ పోలవరం పై రాష్ట్ర ప్రభుత్వ వైఖరి ఏమిటో తెలియటం లేదన్నారు. పోలవరం విషయంలో ఏపీ భావితరాలు జగన్ ప్రభుత్వాన్ని, గత టిడిపి ప్రభుత్వాన్ని క్షమించవన్న కేవీపీ రామచంద్రరావు పోలవరం పూర్తి అయితే చాలా ఎత్తిపోతల పథకాలు నిర్మించుకునే వీలుందని అన్నారు రెండు వేల టిఎంసి ల నీరు వినియోగించుకోవచ్చునని తెలిపారు. వైసిపి ప్రభుత్వం పోలవరాన్ని ఏటీఎమ్ లా వాడుకుంటోదని కేంద్రంలో ఉన్నత స్థాయిలో నీ వ్యక్తి నాతో అన్నారన్నారు. అది బ్యారేజి లా మిగిలి పోకూడదని, ఢిల్లీ వెళ్లిన ముఖ్యమంత్రి జగన్ కేంద్రం నుంచి ఏం సాధించుకునీ వచ్చారో తెలియజేయాలని కోరారు.