జన్మలో మారవు బాబూ... సాయిరెడ్డి ట్వీట్

రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఎప్పుడూ ట్విట్టర్ లో యాక్టివ్ గా ఉంటారు. టీడీపీ అధినేత చంద్రబాబుపై విమర్శలు చేస్తుంటారు;

Update: 2022-07-23 04:25 GMT
జన్మలో మారవు బాబూ... సాయిరెడ్డి ట్వీట్
  • whatsapp icon

వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఎప్పుడూ ట్విట్టర్ లో యాక్టివ్ గా ఉంటారు. తెలుగుదేశం పార్టినీ, ఆ పార్టీ అధినేత చంద్రబాబుపై విమర్శలు చేస్తుంటారు. తాజాగా ఆయన చంద్రబాబు వరద పర్యటనపై ఆయన ట్వీట్ చేశారు. చౌకబారు డ్రామాలు మీ పేటెంటు చంద్రబాబూ... మీతో అగ్రనటులు కూడా పోటీ చేయలేరని ట్వీట్ చేశారు. వరద నీటిని బాటిళ్లలో నింపి వాటినే జనం తాగుతున్నారని నమ్మించాలని చూశారంటూ సెటైర్ వేశారు.

వరద ప్రాంత పర్యటనలో.....
అయితే దానిని చూసిన వరద బాధితులే నవ్వుకుంటున్నారని, మీరు జన్మలో మారరని చంద్రబాబును ఉద్దేశించి విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. రెండు రోజుల క్రితం చంద్రబాబు పశ్చిమ గోదావరి జిల్లా పర్యటనలో బురద నీటి బాటిల్ ను చూపిస్తూ వీటినే ప్రజలకు సరఫరా చేస్తున్నారని ప్రభుత్వంపై విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. అయితే తనకు టీడీపీ నేతలే ఆ బాటిల్ ఇచ్చి చంద్రబాబుకు ఇవ్వమన్నారని ఒక అవ్వ చెప్పడంతో ఆ విషయాన్ని వైసీపీ నేతలు బయట పెట్టారు. దీనిపై విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.


Tags:    

Similar News