RGV : ఏపీ హైకోర్టులో వర్మ మరో పిటీషన్
ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో రామ్‌గోపాల్ వర్మ మరో పిటిషన్ దాఖలు చేశారు;
ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో రామ్‌గోపాల్ వర్మ మరో పిటిషన్ దాఖలు చేశారు. తాను ఎక్స్‌లో పెట్టిన పోస్టుపై అనేక కేసులు నమోదు చేస్తున్నారని పిటిషన్ వేశారు.చట్టవిరుద్ధంగా ఒక విషయంపై ఇన్ని కేసులు పెడుతున్నారని ఆర్జీవీ పిటిషన్ లో పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కేసులు నమోదు చేయడం చట్ట విరుద్ధమని పిటీషన్ లో వర్మ తెలిపారు. ఇకపై ఈ పోస్టులపై కేసులు నమోదు చేయకుండా ఆదేశించాలని పిటిషన్ ను హైకోర్టులో దాఖలు చేశారు.
వర్మ ఏమన్నారంటే?
ఇప్పటివరకు తనపై నమోదైన కేసులు క్వాష్ చేయాలని ఆర్జీవీ పిటిషన్ వేశారు. *నేడు వర్మ పిటిషన్‌పై ఏపీ హైకోర్టు విచారించనుంది. చంద్రబాబు, లోకేశ్ ప్రతీకార రాజకీయాలు చేస్తారని అనుకోవడం లేదని ఆర్జీవీ అన్నారు. 164 సీట్లతో రికార్డు స్థాయిలో వాళ్లు గెలవడమే అసలైన ప్రతీకారమని తెలిపారు. తన సినిమాలు, పోస్టులు.. ఒక్క ఓటును కూడా ప్రభావితం చేయలేకపోయాయన్న వర్మ తనను వాళ్లు పట్టించుకుంటారని అస్సలు అనుకోవడం లేదని చెప్పారు.