Ramoji Rao : ఈనాడు సంస్థల అధిపతి రామోజీరావు మృతి

ఈనాడు గ్రూపు సంస్థల ఛైర్మన్ రామోజీరావు మరణించారు. ఈరోజు ఆయన తుది శ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు

Update: 2024-06-08 02:52 GMT

ఈనాడు గ్రూపు సంస్థల ఛైర్మన్ రామోజీరావు మరణించారు. ఈరోజు ఆయన తుది శ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ నెల 5వ తేదీన శ్వాస తీసుకోవడంలో ఆయన ఇబ్బందులు పడటంతో నగరంలోని ఒక ఆసుపత్రిలో చేర్చారు. అక్కడ చికిత్స పొందుతూ ఈరోజు తెల్లవారు జామున మరణించారు. తెల్లవారు జామున 4.50 గంటలకు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఆయన భౌతిక కాయాన్ని ఫిల్మ్ సిటీకి తరలించనున్నారు. ౧౯౩౬ నవంబరు 16న కృష్ణా జిల్లాలోని పెదపారుపూడిలో రామోజీరావు జన్మించారు. ఈటీవీ ని కూడా ప్రారంభించారు. రైతుల కోసం అన్నదాతను ప్రారంభించారు.

88 ఏళ్ల వయసులో...
ప్రస్తుతం ఆయన వయసు 88 సంవత్సరాలు. ఈనాడు దినపత్రిను ప్రారంభించి ఆయన అందరికీ సుపరిచితమయ్యారు. ఉషా కిరణ్ మూవీస్ సంస్థను ఏర్పాటు చేసి సినిమాలను కూడా రూొపందించారు. ప్రియా పచ్చళ్ల సంస్థను కూడా ఏర్పాటుచేశారు. మీడియా మొగల్ గా ఆయన పేరుగాంచారు. 1965లో అడ్వర్టైజ్‌మెంట్ సంస్థను ఏర్పాటు చేసిన రామోజీ రావు అప్పటి నుంచి వెనుదిరగి చూడలేదు. మార్గదర్శిని కూడా ఏర్పాటు చేశారు.  ఆయన సుదీర్ఘ కల ఫిలింసిటీని పద్దెనిమిది వందల ఎకరాల్లో నిర్మించారు. హైదరాబాద్ లో సినీ పరిశ్రమకు అవకాశాలను గుర్తించి నాడే ఫిలింసిటీని నిర్మించారు. రామోజీ రావు మృతి పట్ల పలువురు సంతాపాన్ని ప్రకటించారు.


Tags:    

Similar News