నేడు ఏపీ అంతటా రాస్తారోకోలు

విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణకై నేడు రాష్ట్ర వ్యాప్తంగా రాస్తా రోకో కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

Update: 2023-05-03 03:03 GMT

విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణకై నేడు రాష్ట్ర వ్యాప్తంగా రాస్తా రోకో కార్యక్రమాలు నిర్వహించనున్నారు. అన్ని ప్రాంతాల్లో రాస్తారోకోలు నిర్వహించి తమ నిరసనలు తెలియజేయాలని నిర్ణయించాయి. దీంతో విజయవాడ, జగ్గయ్యపేట, నందిగామ, మైలవరంలో సిపిఎం, సిఐటియు, ఇతర కార్మిక, రైతు, వామపక్ష పార్టీల నేతలను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. నేతల ఇళ్ల వద్ద పోలీసుల మోహరించారు. విజయవాడ కృష్ణలంక రాణి గారి తోట వద్ద ఉన్న నేషనల్ హైవే వద్ద విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట వేదిక ఆధ్వర్యంలోనిరసన తెలియజేయనున్నారు.

లారీలు బంద్...
నేడు ఏపీ వ్యాప్తంగా లారీలు బంద్ చేయనున్నట్లు లారీ ఓనర్స్ అసోసియేషన్ తెలిపింది. విశాఖ ఉక్కు పరిరక్షణలో భాగంగా తాము బంద్ చేయాలని నిర్ణయించినట్లు తెలిపింది. ఈరోజు ఉదయం 9 గంటల నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లారీలు ఎక్కడికక్కడ... నిలిపివేయాలని పిలుపునిచ్చింది. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఎనిమిది వందల రోజులుగా ఉక్కు ఫ్యాక్టరీ కార్మికులు దీక్షలు చేస్తూ ఉన్నారు. 32 మంది బలిదానంతో నాడు సాధించుకున్న ఉక్కు పరిశ్రమని ప్రైవేటుపరం కాకుండా ఏపీ రాష్ట్ర లారీల ఓనర్స్ అసోసియేషన్ ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందని తెలిపారు.


Tags:    

Similar News