ఆయన్ను వైసీపీ నుండి సస్పెండ్ చేసిన సీఎం జగన్

Update: 2022-10-13 03:35 GMT

వైఎస్సార్‌సీపీ మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ నేత రావి వెంకటరమణను పార్టీ నుంచి సస్పెండ్‌ చేస్తూ వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఓ ప్రకటన విడుదల చేశారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారంటూ ఆయన్ను పార్టీ నుండి తప్పించారు. పొన్నూరు ఎమ్మెల్యే రావి వెంకట రమణ, వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే కిలారి రోశయ్య వర్గీయులు నియోజకవర్గంలో ఆధిపత్యం కోసం ప్రయత్నిస్తున్నారు. ఇటీవల పెదకాకాని మండల పార్టీ అధ్యక్షుడు పూర్ణపై దాడి జరగడంతో ఇరువర్గాల మధ్య చిచ్చు రాజుకుంది. ఈ విషయంపై రవి అనుచరులు నిరసనకు దిగారు. అంతర్గత పోరుకు ముగింపు పలికేందుకు వైసీపీ వెంకట రమణను పార్టీ నుంచి తొలగించినట్లు సమాచారం. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు వచ్చిన ఫిర్యాదుల మేరకు సస్పెండ్ చేసినట్లు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. పెదకాకాని మండలం పార్టీ అధ్యక్షుడు పూర్ణపై దాడి జ‌రిగింది. ఎమ్మెల్యే కిలారి రోశ‌య్య వ‌ర్గమే ఈ దాడికి పాల్పడిందని రావి వెంకటరమణ వర్గం ఆరోపిస్తోంది. పూర్ణ రావి వెంక‌ట‌ర‌మ‌ణ వ‌ర్గం కావ‌టంతోనే దాడి జ‌రిగింద‌ని చెబుతున్నారు. దీంతో నిందితులను అరెస్టు చేయాలని పార్టీ నేత‌లు ఆందోళ‌న‌కు దిగారు. సొంత పార్టీ నేత‌లపైనే దాడి జ‌రిగితే ప‌ట్టించుకోరా అంటూ ఫ్లెక్సీలు పెట్టారు. ఈ నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే రావి వెంక‌ట‌ర‌మ‌ణను సస్పెండ్ చేస్తూ వైసీపీ కీలక నిర్ణయం తీసుకుంది.

పెదకాకాని మండలం వెంకటకృష్ణాపురం గ్రామానికి చెందిన గుంటముక్కల పూర్ణచంద్రరావు(పూర్ణ) సుదీర్ఘకాలంగా వైసీపీ పెదకాకాని మండలం అధ్యక్షుడిగా పనిచేస్తున్నాడు. గత ఎన్నికల్లో పార్టీ విజయానికి ఎంతో కృషి చేశారు. గత కొద్ది నెలలుగా పొన్నూరు నియోజకవర్గం వైసీపీలో అంతర్గత విభేదాలు బట్టబయలయ్యాయి. అమరావతి రోడ్డులో గుర్తు తెలియని ముగ్గురు వ్యక్తులు కత్తులు, ఇనుపరాడ్లతో పూర్ణపై దాడికి దిగారు. చీకట్లో ఓ పథకం ప్రకారం అతను ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనానికి ఇనుప రాడ్డును అడ్డంపెట్టి కింద పడేటట్టు చేశారు. కింద పడ్డ పూర్ణపై ఇనుపరాడ్లతో విచక్షణారహితంగా కొట్టారు. తీవ్రమైన రక్తస్రావంతో కింద పడిపోయి ఉన్న ఆయన వైద్య చికిత్స నిమిత్తం గుంటూరులోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు.


Tags:    

Similar News