రెడ్ అలర్ట్.. ఇక చాలా జాగ్రత్తగా ఉండాల్సిందే!!
దక్షిణకోస్తా తీరానికి సమాంతరంగా పయనించనుందని, మంగళవారం మధ్యాహ్నం
నైరుతి బంగాళాఖాతంలో వాయుగుండం కాస్తా తీవ్ర వాయుగుండంగా బలపడింది. రేపటికి తుపానుగా మారే అవకాశముందని విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ఆ తర్వాత దక్షిణకోస్తా తీరానికి సమాంతరంగా పయనించనుందని, మంగళవారం మధ్యాహ్నం నెల్లూరు-మచిలీపట్నం మధ్య తీరం దాటే అవకాశముందని తెలిపింది. నెల్లూరు జిల్లా వైపు మిచాంగ్ తుపాను దూసుకొస్తూ ఉండడంతో ఐఎండీ రెడ్ ఎలర్ట్ ప్రకటించింది. మంగళవారం భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదైయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఆదివారం నుంచి కోస్తా తీరం వెంబడి గంటకు 80 -100 కీమీ వేగంతో బలమైన గాలులు వీస్తాయి. మత్స్యకారులు మంగళవారం వరకు వేటకు వెళ్లరాదని, రైతులు వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు అధికారులు.
ఈ తుపాను కారణంగా ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, ఒడిశాలలో భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. సముద్రంలోకి చేపల వేటపై నిషేధం విధించారు. మత్స్యకారులు ఎవరూ చేపల వేటకు వెళ్లవద్దని ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ తుపాను ప్రభావం కారణంగా ఆంధ్రప్రదేశ్, ఒడిశా, తమిళనాడు, పుదుచ్చేరి లలో భారీ వర్షాలు నమోదవుతాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.