విశాఖకు రెడ్ అలర్ట్.. బయటకు రాకండి
అల్పపీడన ప్రభావంతో నగరమంతా భారీ నుంచి అతిభారీ వర్షం కురుస్తుందని తెలిపింది. అలాగే ఈదురుగాలులు ..
విశాఖ నగరాన్ని భారీ వర్షం ముంచెత్తనుంది. సోమవారం సాయంత్రం 5-6 గంటల వరకూ భారీ వర్షం కురుస్తుందని, ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావొద్దని వాతావరణ విభాగం హెచ్చరించింది. అల్పపీడన ప్రభావంతో నగరమంతా భారీ నుంచి అతిభారీ వర్షం కురుస్తుందని తెలిపింది. అలాగే ఈదురుగాలులు కూడా వీస్తాయని పేర్కొంది. ముఖ్యంగా భీమిలి, మధురవాడ, ద్వారకానగరం, సీతమ్మధార, జగదాంబ ప్రాంతాల్లో భారీ వర్షసూచన చేసింది. కొన్ని ప్రాంతాల్లో పిడుగులు పడనున్న నేపథ్యంలో.. వర్షాలు పడేటపుడు ఎవరూ చెట్లకింద నిలబడొద్దని హెచ్చరించింది. విశాఖ సమీపంలోని రైతులు పొలాల్లో ఉండొద్దని సూచించింది.