Revanth Reddy : రేవంత్ ప్రమాణం ముహూర్తంలో మార్పు

తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి రేపు ప్రమాణ స్వీకారం చేయనున్నారు;

Update: 2023-12-06 06:05 GMT
revanth reddy, tpcc chief, oath, chief minister
  • whatsapp icon

తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి రేపు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఎల్.బి. స్టేడియంలో అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. చీఫ్ సెక్రటరీ, ఇతర ఉన్నతాధికారులు ఎల్బీస్టేడియానికి వచ్చి అక్కడి పరిస్థితులను సమీక్షిస్తున్నారు. ప్రమాణ స్వీకారానికి పెద్ద సంఖ్యలో వీవీఐపీలు హజరవుతున్నారు. సోనియా, రాహుల్, ప్రియాంక, మల్లికార్జున ఖర్గేతో పాటు ఎన్డీఏ కూటమిలోని పార్టీల నేతలు ఈ ప్రమాణస్వీకారానికి హాజరయ్యే అవకాశాలుండటంతో భారీ భద్రతను ఏర్పాటు చేస్తున్నారు.

మధ్యాహ్నానికి మార్పు...
మరోవైపు తెలంగాణ ముఖ్యమంత్రిగా రేపు ఉదయం 10.28 గంటలకు ప్రమాణ స్వీకారం చేయాలనుకున్నారు. అయితే కొన్ని కారణాలతో మరింత ఆలస్యంగా ప్రమాణ స్వీకారం జరగనుంది. మధ్యాహ్నం 1.04 గంటలకు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని అధికారిక వర్గాలు తెలిపారు. పెద్దయెత్తున రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా పొరుగు రాష్ట్రం నుంచి కూడా రేవంత్ అభిమానులు హైదరాబాద్ చేరుకుంటున్నారు. రేవంత్ తో పాటు మంత్రులు ఎవరెవరు ప్రమాణ స్వీకారం చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది.


Tags:    

Similar News