Andhra Pradesh : నేటి నుంచి ఏపీలో రెవెన్యూ సదస్సులు
ఆంధ్రప్రదేశ్ లో నేటి నుంచి రెవెన్యూ సదస్సులు ప్రారంభం కానున్నాయి;
ఆంధ్రప్రదేశ్ లో నేటి నుంచి రెవెన్యూ సదస్సులు ప్రారంభం కానున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఈ సదస్సులు జరుగుతాయి. భూ వివాదాలను పరిష్కరించడమే లక్ష్యంగా ఈ సదస్సులను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. రెవెన్యూ గ్రామ సభలను నిర్వహించి గ్రామాల్లో నెలకొన్న భూ తగాదాలను పరిష్కరించే దిశగా అధికారులు ప్రయత్నిస్తారు.
జనవరి ఎనిమిది వరకూ...
ఈరోజు నుంచి జనవరి 8వ తేదీ వరకూ రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ గ్రామ సభలు నిర్వహిస్తారు. పెద్ద గ్రామాల్లో రోజంతా నిర్వహిస్తారు. చిన్న గ్రామాల్లో ఒక పూట మాత్రమే నిర్వహిస్తారు. ఈ సభలకు తహసిల్దార్ తో పాటు రెవెన్యూ ఇన్స్ పెక్టర్, వీఆర్ఓ, మండల సర్వేయర్ లు పాల్గొంటారు. భూములకు సంబంధించిన ఏదైనా వివాదాలుంటే రికార్డులను చూసి వాటిని పరిష్కరిస్తారు.