నల్లగా మారిన విశాఖ బీచ్
విశాఖపట్నంలోని ఆర్కే బీచ్ నిన్న నల్లగా మారింది. ఒక్కసారిగా నల్లగా మారడంతో స్థానికులు ఆందోళనకు గురవుతున్నారు.
విశాఖపలోని ఆర్కే బీచ్ నిన్న నల్లగా మారింది. ఒక్కసారిగా నల్లగా మారడంతో స్థానికులు ఆందోళనకు గురవుతున్నారు. ఆర్కే బీచ్ వద్ద ఉన్న ఇసుక ఎప్పుడు తళతళ మెరుస్తూ ఉంటుంది. అటువంటిది ఇలా ఒక్కసారి నల్లగా మారిపోవడానికి కారణమేంటన్న చర్చ స్థానికుల్లో మొదలయింది. ఇప్పటి వరకూ తాము ఇసుకను నల్లగా మారడం చూడ లేదని స్థానికులు చెబుతున్నారు. అయితే దీనికి కారణాలు తెలుసుకోవాలని కొందరు ప్రయత్నాలు కూడా చేశారు.
సముద్రంలోని మురుగు...
విశాఖపట్నంలోని ఆంధ్ర యూనివర్సిటీ భూ విజ్ఞాన శాస్త్రవేత్తలు మాత్రం సముద్రంలోని మురుగు ఒడ్డుకు కొట్టుకు రావడంతో నల్లగా మారుతుందని చెబుతున్నారు. సముద్రంలోని ఇనుప రజను ఎక్కువ మొత్తంలో కొట్టుకు వచ్చినప్పుడు ఇలా నల్లగా మారుతుందని అంటున్నారు. దీనిపై పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అంటున్నారు.