నేటి నుంచి నెల్లూరులో రొట్టెల పండగ
నెల్లూరులో నేటి నుంచి రొట్టెల పండగ జరుగుతుంది. ఈనెల 13వ తేదీ వరకూ ఈ పండగ జరుగుతుంది.
నెల్లూరులో నేటి నుంచి రొట్టెల పండగ జరుగుతుంది. ఈనెల 13వ తేదీ వరకూ ఈ పండగ జరుగుతుంది. మత సామరస్యానికి ప్రతీకగా నెల్లూరులోని బారాషషీద్ దర్గా వద్ద ఈ రొట్టెల పండగ జరగుతుంది. వివిధ రకాల కోరికలతో వచ్చే వారు రొట్టెలు సమర్పిస్తే తమ కోరికలు నెరవేరతాయని ప్రతీతి. అందుకే నెల్లూరులో జరిగే రొట్టెల పండగకు దేశంలోని నలుమూలల నుంచి భక్తులు తరలి వస్తారు.
దేశం నలుమూలల నుంచి.....
కులమతాలతకు అతీతంగా ఈ పండగకు హాజరవుతారు. రొట్టెల పండగను రాష్ట్ర పండగగా ప్రభుత్వం 2015లోనే ప్రకటించింది. లక్షలాది మంది భక్తులు తరలి వస్తుండటంతో అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. దర్గా వద్దకు వచ్చే వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు.