సమ్మెకు సిద్ధమవుతున్న ఆర్టీసీ... ఉద్యోగ సంఘాలకు మద్దతు
ఏపీలో ఆర్టీసీ కార్మికులు సమ్మెకు సిద్ధమవుతున్నాయి. ఆర్టీసీ సంఘాలు ఉద్యోగుల సమ్మెకు మద్దతు ప్రకటిస్తున్నట్లు తెలిపాయి.
ఆంధ్రప్రదేశ్ లో ఆర్టీసీ కార్మికులు కూడా సమ్మెకు సిద్ధమవుతున్నాయి. ఆర్టీసీ సంఘాలు ఉద్యోగుల సమ్మెకు మద్దతు ప్రకటిస్తున్నట్లు తెలిపాయి. ఆర్టీసీలోని ప్రధాన సంఘాలన్నీ భేటీ అయి ఈ నిర్ణయం తీసుకున్నాయి. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసినా తమకు అనేక సమస్యలు ఉన్నాయని నేతలు చెప్పారు. తమకు పీఆర్సీని ప్రకటించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. తమను ప్రభుత్వంలో విలీనం చేయడం సంతోషకరమేనని, అయితే తమ ప్రయోజనాలను కాపాడుకోవడానికి సమ్మెకు మద్దతిస్తున్నట్లు ప్రకటించారు.
తొమ్మిది సంఘాలు...
ఆర్టీసీలోని ప్రధానమైన తొమ్మది సంఘాలు పీఆర్సీ సాధన సమితికి మద్దతు ప్రకటించాయి. అయితే ప్రభుత్వ ఉద్యోగులు వచ్చే నెల 6వ తేదీ అర్ధరాత్రి నుంచి సమ్మెకు వెళుతున్నారు. అయితే ఆర్టీసీ ఉద్యోగులు మాత్రం ఆరోతేదీ నుంచి కాకుండా ప్రభుత్వానికి కొంత సమయమిచ్చి సమ్మెలోకి దిగనున్నారు. ఆర్టీసీ కార్మికులు కూడా యాజమాన్యానికి నోటీసులు ఇవ్వనున్నాయి.