భవానీ భక్తులతో నిండిన ఇంద్రకీలాద్రి
ఇంద్రకీలాద్రిపై భవానీ భక్తుల రద్దీ రెండో రోజు కూడా రద్దీ కొనసాగుతుంది.
ఇంద్రకీలాద్రిపై భవానీ భక్తుల రద్దీ రెండో రోజు కూడా రద్దీ కొనసాగుతుంది. భవానీ భక్తులు దీక్షను విరమిస్తుండటంతో వేల సంఖ్యలో భవానీలు కొండ మీదకు చేరుకుంటున్నారు. క్యూ లైన్లన్నీ భవానీ భక్తులతో నిండిపోయాి. వినాయకుడి గుడి నుంచి అమ్మవారి ఆలయం వరకూ భవానీ భక్తులు కనిపిస్తున్నారు.
నాలుగు క్యూలైన్లలో...
మొత్తం నాలుగు క్యూలైన్లు ఉండగా వాటిలో భవానీ భక్తులు అమ్మవారి దర్శనం కోసం వేచి చూస్తున్నారు. ఇంద్రకీలాద్రి గిరి చుట్టూ ప్రదిక్షిణలు చేస్తున్నారు. అధికారులు భవానీల దీక్ష విరమణల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అయితే సరైన సౌకర్యాలు లేవని భవానీ భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.