రష్ ఎలా ఉందంటే?
తిరుమలలో భక్తుల రద్దీ ఇంకా కొనసాగుతూనే ఉంది. శుక్రవారం కావడంతో భక్తులు ఎక్కువ సంఖ్యలో తిరుమలకు చేరుకుంటున్నారు
తిరుమలలో భక్తుల రద్దీ ఇంకా కొనసాగుతూనే ఉంది. శుక్రవారం కావడంతో భక్తులు ఎక్కువ సంఖ్యలో తిరుమలకు చేరుకుంటున్నారు. శని, ఆదివారాలు ఎటూ రద్దీగానే ఉంటాయి. ఈ వారం మొత్తం భక్తులతో తిరుమల కిటికిటలాడుతూనే ఉంది. గోవింద నామ స్మరణలతో మారుమోగిపోతుంది.
తమిళనాడు నుంచి...
వీకెండ్ లో సహజంగా రద్దీ ఎక్కువగా ఉంటుంది. అయితే ఆన్‌లైన్ లో టిక్కెట్లు బుక్ చేసుకున్న వారితో పాటు తమిళనాడు నుంచి అధిక సంఖ్యలో భక్తులు రావడంతో తిరుమల గిరులు భక్తులతో నిండిపోయాయి. క్యూ కాంప్లెక్స్‌లన్నీ భక్తులతో నిండిపోవడంతో టీటీడీ అధికారులు అన్నప్రసాదాలను భక్తులకు క్యూ లైన్‌లలోనే అందచేస్తున్నారు.
18 గంటలు...
నిన్న తిరుమల శ్రీవారిని 61,926 మంది భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు. వీరిలో 21,237 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించుకుని తమ మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల హుండీ ఆదాయం 4.32 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. ఈరోజు తిరుమలలో పద్దెనిమిది కంపార్ట్‌మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. సర్వదర్శనానికి పద్దెనిమిదిగంటల సమయం పడుతుందని టీటీడీ చెబుతుంది.