Tirumala : రద్దీ తగ్గడం లేదు... కారణమిదే
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. క్యూ కాంప్లెక్స్‌లోని కంపార్ట్‌మెంట్లన్నీ భక్తులతో నిండిపోయాయి.
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. క్యూ కాంప్లెక్స్‌లోని కంపార్ట్‌మెంట్లన్నీ భక్తులతో నిండిపోయాయి. భక్తుల రద్దీ ఎక్కువగా ఉండటంతో తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. వారికి క్యూ లైన్లలోనే అన్న ప్రసాదం, మంచినీరును సరఫరా చేస్తున్నారు. వీకెండ్ వరకూ ఇదే రద్దీ కొనసాగే అవకాశముందని చెబుతున్నారు.
హుండీ ఆదాయం...
నిన్న తిరుమల శ్రీవారిని 71,123 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 26,689 మంది భక్తులు తలనీలాలను సమర్పించి తమ మొక్కులు చెల్లించుకున్నారని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.84 కోట్ల రూపాయలు వచ్చిందని వెల్లడించారు. ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని 26 కంపార్ట్‌మెంట్లలో భక్తులు స్వామి వారి దర్శనం కోసం వేచి ఉన్నారు. సర్వదర్శనం క్యూ లైన్ లో కి టోకెన్లు లేకుండా ప్రవేశించే భక్తులకు పథ్నాలుగు గంటల సమయం పడుతుంది.