Tirumala : క్యూలైన్లు నిండిపోయి.. బయట వరకూ.. దర్శన సమయం ఎంతంటే

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. కంపార్ట్‌మెంట్లన్నీ భక్తులతో నిండిపోయాయి

Update: 2023-11-17 03:21 GMT

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. శుక్రవారం కావడం, నాగుల చవితి పండగ రోజున భక్తులు అధిక సంఖ్యలో స్వామి వారిని దర్శించుకునేందుకు బారులు తీరారు. ఇక రేపు, ఎల్లుండి కూడా తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉండనుంది. ప్రతి శని, ఆదివారాలు తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ముందుగానే అన్ని ఏర్పాట్లు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు చేస్తున్నారు.

24 గంటలు...
ఈరోజు వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని కంపార్ట్‌మెంట్లన్నీ భక్తులతో నిండిపోయాయి. బయట శిలాతోరణం వరకూ క్యూ లైన్ లో భక్తులు స్వామి వారి దర్శనం కోసం వేచి ఉన్నారు. శ్రీవారి దర్శనానికి సర్వదర్శనం క్యూ లైన్ లో టోకెన్లు లేని భక్తులకుక 24 గంటల సమయం పడుతుందని అధికారులు వెల్లడించారు. నిన్న తిరుమల శ్రీవారిని 62,494 మంది భక్తులు దర్శించుకున్నారు. 27,666 మంది భక్తులు తలనీలాలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.59 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని అధికారులు తెలిపారు.


Tags:    

Similar News