Tirumala : తిరుమల... శనివారం... ఇక రద్దీ సంగతి?

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. శనివారం కావడంతో భక్తుల రద్దీ మరింత పెరిగింది.

Update: 2024-03-23 02:55 GMT

Tirumala

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. శనివారం కావడంతో భక్తుల రద్దీ మరింత పెరిగింది. సహజంగా శనివారం తిరుమల వెంకన్నను దర్శించుకుంటే మంచిదని భావిస్తారు. అందుకే శని, ఆదివారాల్లో భక్తుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ముందుగా బుక్ చేసుకున్న వారితో పాటు సాధారణ భక్తులు కూడా తిరుమలకు చేరుకున్నారు. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లను కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం మూడు నుంచి నాలుగు గంటల సమయం పడుతుంది.

హుండీ ఆదాయం...
నిన్న తిరుమల శ్రీవారిని 59,236 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 25,446 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 4.38 కోట్ల రూపాయలు వచ్చిందని అధికారులు తెలిపారు. ఈరోజు తిరుమలలోని వైకుంఠం కాంప్లెక్స్‌లోని పదిహేను కంపార్ట్‌మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. సర్వదర్శనం క్యూ లైన్ లో భక్తులకు శ్రీవారి దర్శనం పన్నెండు గంటల సమయం పడుతుంది.


Tags:    

Similar News