కొత్త ఏడాది తొలిరోజు రద్దీ ఎలాగుందంటే?
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. ఆదివారం కావడం, కొత్త ఏడాది తొలి రోజు కావడంతో భక్తుల రద్దీ మరింత పెరిగింది.
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. ఆదివారం కావడం, కొత్త ఏడాది తొలి రోజు కావడంతో భక్తుల రద్దీ మరింత పెరిగింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని 15 కంపార్ట్మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. సర్వదర్శనం క్యూ లైన్ లో వేచి ఉన్న వారికి శ్రీవారి దర్శనం 18 గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు.
హుండీ ఆదాయం...
నిన్న తిరుమల శ్రీవారిని 78,460 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. వీరిలో 29,182 మంది భక్తులు తలనీలాలను సమర్పించుకుని తమ మొక్కులు తీర్చుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 4.03 కోట్ల రూపాయలు వచ్చిందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు. ఈరోజు అర్థరాత్రి నుంచి వైకుంఠ ద్వార దర్శనం ప్రారంభమవుతుంది.