తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. నేటి నుంచి సర్వదర్శనం క్యూ లైన్ భక్తులు దర్శించుకుంటున్నారు

Update: 2023-01-12 02:32 GMT

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. నేటి నుంచి సర్వదర్శనం క్యూ లైన్ భక్తులతో పాటు మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనానికి భక్తులను అనుమతిస్తారు. దీంతో అధిక సంఖ్యలో భక్తులు స్వామి వారి దర్శనం కోసం వేచి ఉన్నారు. నిన్నటి వరకూ ఉత్తర ద్వార దర్శనం ద్వారా భక్తులను స్వామి వారిని దర్శించుకున్నారు. నిన్నటితో ఉత్తర ద్వార దర్శనం పూర్తయింది. నేటి నుంచి తిరుమల శ్రీవారిని యధాతధంగా దర్శించుకునే వీలు కల్పించారు.

యధాతధంగా...
మూడు వందల రూపాయల ప్రత్యేక ద్శనం టిక్కెట్లను కూడా జారీ చేయడంతో నేటి నుంచి వారిని కూడా అనుమతించనున్నారు. నిన్న తిరుమల శ్రీవారిని 68,855 మంది భక్తులు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు. వీరిలో 21,280 మంది భక్తులు తలనీలాలను సమర్పించుకుని తమ మొక్కులు తీర్చుకన్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.61 కోట్ల రూపాయలు వచ్చిందని అధికారులు వెల్లడించారు.


Tags:    

Similar News