ఏడాది చివరి రోజు.. తిరుమలలో రద్దీ?
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని 24 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని 24 కంపార్ట్‌మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. శ్రీవారి దర్శనానికి సర్వదర్శనం క్యూ లైస్ లో ఉన్న భక్తులకు 24 గంటల సమయం పడుతుంది. సర్వదర్శనం టోకెన్లు పొందిన భ్తులకు నాలుగు నుంచి ఐదు గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు. ఉచిత దర్శనం క్యూ లైన్లు నిండిపోయాయి. శనివారం కావడంతో భక్తుల రద్దీ ఎక్కువగానే ఉంది. అందునా సంవత్సరం చివరి తేదీ డిసెంబరు 31వ తేదీ కావడంతో భక్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందన్న అంచనాలు వినపడుతున్నాయి.
శ్రీవాణి టిక్కెట్లు...
మూడు వందల శీఘ్రదర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసినే భక్తులకు శ్రీవారి దర్శనం రెండు నుంచి మూడు గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. నిన్న తిరుమల శ్రీవారిని 63,253 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 24,490 మంది భక్తులు తలనీలాలను సమర్పించి తమ మొక్కులు తీర్చుకున్నారు. నిన్న స్వామి వారి హుండీ ఆదాయం 5.16 కోట్ల రూపయలు వచ్చిందని అధికారులు తెలిపారు. జనవరి 11 వతేదీ వరకూ శ్రీవాణి టిక్కెట్లను తిరుమల తిరుపతి దేవస్థానం నిలుపుదల చేసింది.