Tirumala : నేడు తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉందంటే?

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతూనే ఉంది. బ్రహ్మోత్సవాలు కావడంతో భక్తులు అధిక సంఖ్యలో తిరుమలకు వచ్చారు.

Update: 2024-10-09 03:52 GMT

Tirumala darshan

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతూనే ఉంది. బ్రహ్మోత్సవాలు కావడంతో భక్తులు అధిక సంఖ్యలో తిరుమలకు వచ్చారు. నిన్న గరుడ వాహన సేవను చూసేందుకు వచ్చిన భక్తులు నేడు స్వామి వారిని దర్శించుకునేందుకు క్యూ లైన్‌లలో ఉన్నారు. దీంతో కంపార్ట్‌మెంట్లన్నీ భక్తులతో నిండిపోయాయి. బ్రహ్మోత్సవాల సమయంలో తిరుమలలో భక్తుల రద్దీ అధికంగానే ఉంటుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ముందుగానే అంచనా వేశారు అందుకు తగిన ఏర్పాట్లు చేశారు. భక్తులు ఇబ్బంది పడకుండా తగిన చర్యలు తీసుకున్నారు. నిన్న గరుడ వాహనం సేవకు దాదాపు మూడున్నర లక్షల మంది భక్తులు వచ్చి ఉంటారని అంచనా వేశారు. అయినా ఎలాంటి ఇబ్బందులు లేకుండా గరుడ సేవను పూర్తి చేయగలిగారు. బ్రహ్మోత్సవాలకు ప్రత్యేకమైన ఏర్పాట్లు చేయడం పట్ల భక్తులు కూడా టీటీడీ అధికార యంత్రాంగాన్ని ప్రశంసిస్తున్నారు. లడ్డూల కౌంటర్ల వద్ద కూడా రద్దీ ఎక్కువగా కనిపిస్తుంది. అన్నదానం సత్రం వద్ద కూడా అధిక సంఖ్యలో భక్లులు వచ్చారు.

పద్దెనిమిది గంటలు...
స్వామి వారిని బ్రహ్మోత్సవాల సమయంలో దర్శించుకుంటే మంచిదని భావించి వేలాది మంది భక్తులు తిరుమలకు వస్తుండటం ప్రతి ఏటా సంప్రదాయంగా వస్తున్న విషయమే. ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్ట్‌మెంట్లు భక్తులతో నిండిపోయాయి. క్యూ లైన్ వెలుపల టీబీసీ వరకూ విస్తరించి ఉంది. క్యూ లైన్ లో ఉన్న భక్తులకు అన్న ప్రసాదాలు, మంచినీటిని అందచేస్తున్నారు. నేడు శ్రీవారి ఉచిత దర్శనానికి పద్దెనిమిది గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. నిన్న తిరుమల శ్రీవారిని 82,043 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 30,100 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 4.10 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని అధికారులు తెలిపారు. మరికొన్ని రోజులు భక్తులు అధిక సంఖ్యలో వస్తారని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు అంచనా వేస్తున్నారు.
Tags:    

Similar News