తిరుమల వెళుతున్నారా?.. అయితే 16 గంటల పాటు
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. గురువారమైనా భక్తుల సంఖ్య అధికంగా ఉంది
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. గురువారమైనా భక్తుల సంఖ్య అధికంగా ఉంది. తిరుమలలో క్యూ లైన్లీ నిండిపోతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు భక్తుల రద్దీకి తగినట్లు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో వస్తున్నారు. తిరుమల వీధులన్నీ గోవిందనామ స్మరణలతో మారుమోగిపోతున్నాయి.
హుండీ ఆదాయం...
నిన్న తిరుమలలో శ్రీవారిని 76,526 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 32,238 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.54 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు. ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని 28 కంపార్ట్‌మెంట్లన్నీ భక్తులతో నిండిపోయాయి. సర్వదర్శనానికి ఈరోజు పదహారు గంటల సమయం పడుతుందని అధికారులు తెలిపారు.