Tirumala : హుండీ ఆదాయం ఎంతో తెలుసా.. క్యూ లైన్ లు కూడా?
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. బుధవారం కూడా భక్తుల రద్దీ అధికంగా ఉంది
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. బుధవారం కూడా భక్తుల రద్దీ అధికంగా ఉంది. కంపార్ట్‌మెంట్లన్నీ భక్తులతో నిండిపోయాయి. వసతి గృహాలు దొరకడం కూడా చాలా కష్టంగా మారింది. వసతి గృహాల కోసం భక్తులు ఎక్కువ సమయం వేచి చూస్తున్నారు. స్వామి వారి దర్శనానికి గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం మూడు నుంచి నాలుగు గంటల సమయం పడుతుంది.
కంపార్ట్‌మెంట్లలో...
ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో 21 కంపార్ట్‌మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. ఉచిత దర్శనం క్యూ లైన్ లోకి టోకెన్లు లేకుండా ప్రవేశించిన వారికి స్వామి వారి దర్శనం పన్నెండు నుంచి పద్దెనిమిది గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. నిన్న తిరుమల శ్రీవారిని 76,665 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. వీరిలో 31,377 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 4.58 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది