Tirumala : తిరుమలలో నేడు భక్తుల రద్దీ ఎలా ఉందంటే?
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. ఆదివారమయినా భక్తులు పెద్ద సంఖ్యలో మాత్రం లేరు
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. ఆదివారమయినా భక్తులు పెద్ద సంఖ్యలో మాత్రం లేరు. ఉష్ణోగ్రతలు గరిష్టానికి చేరుకోవడంతో భక్తులు కూడా ఆధ్మాత్మిక, పర్యాటక ప్రదేశాలకు తక్కువగా వస్తున్నారు. అందులో భాగంగానే తిరుమలకు కూడా భక్తులు సంఖ్య తక్కువగానే ఉన్నారని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు స్వామి వారి దర్శనం రెండు గంటల సమయం పడుతుంది.
పది గంటలు...
నిన్న తిరుమల శ్రీవారిని 75,414 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 30,073 మంది భక్తులు తలనీలాలను సమర్పించుకుని తమ మొక్కులు చెల్లించుకున్నారని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.68 కోట్ల రూపాయల ఆదాయం లభించింది. ఈరోజు తిరుమల వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని పదిహేడు కంపార్ట్మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. సర్వదర్శనం భక్తులకు శ్రీవారి దర్శనం పది గంటల సమయం పడుతుంది.