Tirumala : ఈరోజు క్యూ లైన్ ఎంత వరకూ ఉందో తెలుసా?
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతూనే ఉంది. సంక్రాంతి సెలవులు వరసగా రావడంతో అధిక సంఖ్యలో భక్తులు తిరుమలకు చేరుకున్నారు
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతూనే ఉంది. సంక్రాంతి సెలవులు వరసగా రావడంతో అధిక సంఖ్యలో భక్తులు తిరుమలకు చేరుకున్నారు. గత రెండు రోజుల నుంచి పెద్దయెత్తున భక్తులు రావడంతో తిరుమల కొండ కిటకిటలాడిపోతుంది. గోవింద నామస్మరణలతో మారుమోగుతుంది. భక్తులకు వసతి గృహాలు దొరకడం కూడా కష్టంగా మారింది. వసతి గృహల కోసం గంటల తరబడి వెయిట్ చేయాల్సి వస్తుంది. అయితే భక్తులందరికీ అన్ని రకాల సౌకర్యాలను ఏర్పాటు చేస్తున్నామని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు.
24 గంటల సమయం...
నిన్న తిరుమల శ్రీవారిని 80,964 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 27,657 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.89 కోట్ల రూపాయలు వచ్చిందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు. ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని కంపార్ట్ మెంట్లన్నీ నిండి బయట ఏటీసీ వరకూ క్యూ లైన్ విస్తరించి ఉంది. సర్వదర్శనం క్యూ లైన్ లో ప్రవేశించే భక్తులకు ఇరవై నాలుగు గంటల సమయం దర్శనానికి పడుతుంది