Tirumala : హోలీ రోజు తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉందంటే?

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. హోలీ సందర్భంగా సెలవు దినం కావడంతో భక్తుల అధిక సంఖ్యలో తిరుమలకు చేరుకున్నారు

Update: 2024-03-25 03:01 GMT

devotees, normal, income, tirumala, darshan, timings

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. హోలీ సందర్భంగా సెలవు దినం కావడంతో భక్తుల అధిక సంఖ్యలో తిరుమలకు చేరుకున్నారు. కంపార్ట్‌మెంట్లన్నీ భక్తులతో నిండిపోయాయి. భక్తులతో తిరుమల వీధులన్నీ కిటకిటలాడుతున్నాయి. భక్తులు స్వామి వారిని దర్శించుకునేందుకు చాలా సమయం పడుతుంది. తిరుమలలో ముందుగా బుక్ చేసుకున్న వారు మాత్రమే కాకుండా సాధారణ భక్తులు కూడా రావడంతో ఒక్కసారిగా రద్దీ పెరిగిందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు.

హుండీ ఆదాయం...
నేడు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో ఉన్న అన్ని కంపార్ట్‌మెంట్లన్నీ భక్తులతో నిండిపోయాయి. క్యూ లైన్ బయట వరకూ విస్తరించి ఉంది. మూడు వందల ప్రత్యేక దర్శనం టిక్కెట్ కొనుగోలు చేసిన భక్తులకు మూడు గంటల సమయం పడుతుంది. సర్వదర్శనం భక్తులకు పన్నెండు గంటల సమయం పడుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 80,532 మంది భక్తులు దర్శించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.95 కోట్ల రూపాయలు వచ్చిందని అధికారులు తెలిపారు.


Tags:    

Similar News