Tirumala : మంగళవారమైనా రద్దీ ఇంతగా ఉందేమిటో?

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. మంగళవారమయినా భక్తులు అధిక సంఖ్యలో తిరుమలకు చేరుకున్నారు.;

Update: 2024-02-13 02:43 GMT
Tirumala, TTD, Tirupati, Tirumala tirupati, andhra news, tirupati devasthanam,  andhrapradesh

 Tirumala tirupati

  • whatsapp icon

Tirumala:తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. మంగళవారమయినా భక్తులు అధిక సంఖ్యలో తిరుమలకు చేరుకున్నారు. సహజంగా వీకెండ్ లో తిరుమల భక్తులతో కిటకిటలాడుతుంది. కానీ ఈరోజు అధిక సంఖ్యలో భక్తులు ఉండటంతో అధికారులు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. క్యూ కాంప్లెక్స్‌లోని కంపార్ట్‌మెంట్లన్నీ భక్తులతో నిండిపోయాయి. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్ కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం మూడు గంటలకు పైగా పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు.

హుండీ ఆదాయం మాత్రం....
నిన్న తిరుమల శ్రీవారిని 69,314 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. వీరిలో 25,165 మంది భక్తులు తలనీలాలను సమర్పించుకుని తమ మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 5.48 కోట్ల రూపాయల ఆదాయం వచ్చినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు. ఈరోజు వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని 20 కంపార్ట్‌మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. సర్వదర్శనం క్యూ లైన్ లోఉన్న భక్తులకు శ్రీవారి దర్శనం పన్నెండు గంటల సమయం పడుతుంది.


Tags:    

Similar News