Tirumala : కంపార్ట్‌మెంట్లన్నీ ఫుల్... దర్శనానికి ఎంత సమయం అంటే?
తిరుమలలో భక్తులు రద్దీ కొనసాగుతూనే ఉంది. అత్యధికంగా భక్తులు తిరుమలకు చేరుకుంటున్నారు
తిరుమలలో భక్తులు రద్దీ కొనసాగుతూనే ఉంది. అత్యధికంగా భక్తులు తిరుమలకు చేరుకుంటున్నారు. సంక్రాంతి సెలవులు ఉండటంతో పాటు వరస సెలవులు పెట్టుకుని మరీ తిరుమలకు వచ్చి శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. క్యూ లైన్లన్నీ భక్తులతో నిండిపోయాయి. వసతి గృహాలు దొరకడం కూడా కష్టంగా మారింది. ముందుగా టిక్కెట్ బుక్ చేసుకున్న వాళ్లంతా తిరుమలకు చేరుకుంటున్నారని, దీనికి తోడు రోజువారీ రద్దీ ఉందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు.
హుండీ ఆదాయం...
నిన్న తిరుమల శ్రీవారిని 62,649 భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 24,384 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించుకుని మొక్కులు చెల్లించుకున్నారని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.74 కోట్ల రూపాయలు వచ్చిందని అధికారులు వెల్లడించారు. ఈరోజు వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని కంపార్ట్‌మెంట్లన్నీ నిండిపోయి బయట కృష్ణతేజ గెస్ట్ హౌస్ వరకూ క్యూ లైన్ విస్తరించి ఉంది. సర్వదర్శనం భక్తులకు పద్దెనిమిది గంటల సమయం పడుతుంది.