Tirumala : ఒక్కసారిగా పెరిగిన రద్దీ... భక్తులు ఒక్కసారిగా రావడంతో?
తిరుమలలో భక్తుల రద్దీ ఒక్కసారిగా పెరిగింది. స్వామి వారి దర్శనానికి ఎక్కువ సమయం పడుతుంది
తిరుమలలో భక్తుల రద్దీ ఒక్కసారిగా పెరిగింది. స్వామి వారి దర్శనానికి ఎక్కువ సమయం పడుతుంది. వసతి గృహాలు దొరకడం కూడా కష్టంగా మారింది. దీంతో భక్తులు ఇబ్బంది పడుతున్నారు. స్వామి వారి దర్శనం కోసం ఇతర రాష్ట్రాల ునంచి ఎక్కువ మంది భక్తులు తిరుమలకు చేరకున్నారని తిరుమల తిరుపతి దేస్థానం అధికారులు తెలిపారు. నేడు మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టోకెన్లు పొందని భక్తులకు స్వామి వారి దర్శనం రెండు నుంచి మూడు గంటల్లో పూర్తవుతుంది.
హుండీ ఆదాయం...
నిన్న తిరుమల శ్రీవారిని 67,832 మంది భక్తులు దర్శించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.55 కోట్ల రూపాయలు వచ్చిందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. నేడు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని పది కంపార్ట్‌మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి చూస్తున్నారు. ఉదయం ఏడు గంటలకు టోకెన్లు లేకుండా సర్వదర్శనం క్యూ లైన్‌లోకి ప్రవేశించిన భక్తులకు స్వామి వారి దర్శనం పద్దెనిమిది గంటల సమయం పడుతుందని అధికారులు తెలిపారు.