తిరుమలలో తగ్గని భక్తులు... క్యూ లైన్ పొడవు ఎంతంటే?

రుమలలో భక్తుల రద్దీ తగ్గడం లేదు. వేసవి సెలవులు కావడంతో రోజురోజుకూ భక్తుల సంఖ్య మరింత పెరుగుతుంది.

Update: 2022-06-11 02:55 GMT

తిరుమలలో భక్తుల రద్దీ తగ్గడం లేదు. వేసవి సెలవులు కావడంతో రోజురోజుకూ భక్తుల సంఖ్య మరింత పెరుగుతుంది. ప్రస్తుతం శ్రీవారి దర్శనానికి 25 గంటల సమయం పడుతుంది. తిరుమలలో కంపార్ట్ మెంట్లన్నీ నిండిపోయి రామ్ బగీచా గెస్ట్ హౌస్ వరకూ క్యూలైన్ కన్పిస్తుంది. తమిళనాడు నుంచి కూడా ఎక్కువ మంది భక్తులు రావడంతోనే ఈ రష్ ఉందని తిరుమల,తిరుపతి దేవస్థానం అధికారులు చెబుతున్నారు.

3.70 కోట్ల ఆదాయం...
నిన్న తిరుమల శ్రీవారిని 67,949 మంది భక్తులు దర్శించుకున్నారు. 39,837 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. నిన్న తిరుమల వెంకటేశ్వరస్వామికి భక్తులు సమర్పించిన హుండీ ఆదాయం 3.70 కోట్లు. భక్తుల రద్దీ మరింత పెరిగే అవకాశముంది. ఈరోజు, రేపు శని, ఆదివారాలు కావడంతో భక్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది. అయితే అందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నామని టీటీడీ చెబుతోంది.


Tags:    

Similar News