Nagarjuna Sagar : ముగిసిన వివాదం.. ఎండ్ కార్డు పడినట్లే
సాగర్ జలాల వివాదం ముగిసింది. డ్యామ్ నిర్వహణను కృష్ణా రివర్ వాటర్ బోర్డు మేనేజ్‌మెంట్ కు అప్పగించడానికి అంగీకరించాయి
నాగార్జున సాగర్ జలాల వివాదం ముగిసింది. డ్యామ్ నిర్వహణను కృష్ణా రివర్ వాటర్ బోర్డు మేనేజ్‌మెంట్ కు అప్పగించడానికి రెండు రాష్ట్రాలు అంగీకరించాయి. నవంబరు 28వ తేదీకి ముందున్న పరిస్థితిని కొనసాగించాలని నిర్ణయించాయి. కేంద్ర హోంశాఖ ప్రతిపాదనను ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు అంగీకరించాయి.
పర్యవేక్షణ బాధ్యతను...
సీఆర్పీఎఫ్ దళాలకు పర్యవేక్షణ బాధ్యతను అప్పగించేందుకు రెండు రాష్ట్రాలు సుముఖత వ్యక్తం చేశాయి. కృష్ణా జలాల్లో 66 శాతం ఏపీకి, 34 శాతం తెలంగాణ పంచుకోవాలన్న నిర్ణయాన్ని ఇకపై కృష్ణా రివర్ వాటర్ బోర్డు మేనేజ్‌మెంట్ అమలు చేస్తుంది. రెండు రోజుల క్రితం ఏపీ తన పరిధిలో ఉన్న మూడు గేట్లను ఎత్తి కిందకు నీటిని విడుదల చేసుకోవడంతో వివాదం తలెత్తిన సంగతి తెలిసిందే.