చంద్రబాబు నాయుడును ఎవరూ ఉరి తీయరు: సజ్జల

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టు వెనుక ఎలాంటి రాజకీయ దురుద్దేశాలు లేవని

Update: 2023-09-09 05:09 GMT

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టు వెనుక ఎలాంటి రాజకీయ దురుద్దేశాలు లేవని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణ రెడ్డి అన్నారు. చంద్రబాబు నాయుడు తన హయాంలో బోగస్ కంపెనీలను సృష్టించి ప్రభుత్వం సొమ్మును అడ్డగోలుగా దోచిపెట్టారని.. రెండు సంవత్సరాల క్రితమే సీఐడీ ఈ కేసు నమోదు చేసినట్లు తెలిపారు. పూర్తిగా విచారణ చేసిన తర్వాత ఈ అరెస్టు జరిగిందని అన్నారు. ఎఫ్‌ఐఆర్‌లో తన పేరు లేకుండా ఎలా అరెస్టు చేస్తారంటూ చంద్రబాబు అంటున్నారని అన్నారు. కానీ 2017,2018లోనే పూణెలో జీఎస్డీ విచారణలో షెల్ కంపెనీలకు సొమ్ము మళ్లించినట్లు అధికారులు అప్పుడే గుర్తించారని అన్నారు. వాస్తవానికి ఎఫ్‌ఐఆర్‌లో చంద్రబాబు నాయుడి పేరు పెట్టకపోవడం అంటే అక్కడే సీఎం జగన్ ప్రభుత్వం నిజాయతీ కనిపిస్తుందని అన్నారు. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో రెండు ప్రశ్నలకు ఇప్పటికీ సమాధానాలు లేవని అన్నారు. దాదాపు రెండు సంవత్సరాల తర్వాత విచారణ చేశాకే కేసు నమోదు చేసినట్లు తెలిపారు. అవినీతి జరగలేదని చంద్రబాబు నిరూపించుకోవాలని అన్నారు.

చంద్రబాబు అరెస్టులో అసలు విషయం పక్కకు వెళ్లేలా టీడీపీ నేతలు గందరగోళం సృష్టిస్తున్నారని మండిపడ్డారు.. చంద్రబాబు అరెస్ట్‌లో ఎలాంటి దురుద్దేశాలు లేవు.. బలమైన ఆధారాలతోనే సిట్ వేశామన్నారు. వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం ఎంతో సంయమనంతో ఉందన్నారు. దర్యాప్తు సంస్థలు ఎంతో స్వేచ్చగా దర్యాప్తు చేస్తున్నాయని తెలిపారు. స్వాతంత్ర్య భారత దేశంలో అత్యంత హేయమైనది ఆర్ధిక నేరమని స్కీమ్‌ పేరుతో స్కామ్‌ చేశారని విమర్శించారు. ఆర్ధిక నేరాల్లో నోటీసు ఇవ్వాల్సి అవసరం లేదన్నారు సజ్జల.. ఎఫ్ఐఆర్ లో పేరు లేదని చంద్రబాబు ఎవరిని దబాయిస్తున్నాడు? అని మండిపడ్డారు.. ఈ స్కామ్‌ లో చంద్రబాబు పాత్ర ఉందన్నది అందరికీ తెలిసిన విషయమేనని అన్నారు. చంద్రబాబు నాయుడును ఎవరూ ఉరి తీయరని.. విచారణ జరిపాక న్యాయస్థానం తీర్పులను ఇస్తుందని అన్నారు.


Tags:    

Similar News