Tirumala : తిరుమలలో ఒక్కసారిగా పెరిగిన రద్దీ

సంక్రాంతి సెలవులు ప్రారంభం కావడంతో ఈరోజు తిరుమలలో రద్దీ పెరిగింది. పెద్ద సంఖ్యలో భక్తులు తిరుమలకు చేరుకున్నారు.;

Update: 2024-01-12 03:17 GMT

Tirumala

సంక్రాంతి సెలవులు ప్రారంభం కావడంతో ఈరోజు తిరుమలలో రద్దీ ఒక్కసారిగా పెరిగింది. పెద్ద సంఖ్యలో భక్తులు తిరుమలకు చేరుకున్నారు. కంపార్ట్‌మెంట్లన్నీ భక్తులతో నిండిపోయాయి. వసతి గదులు దొరకడం కూడా కష్టంగా మారింది. నిన్నటి వరకూ నేరుగా స్వామి వారి దర్శనం జరగగా, ఈరోజు మాత్రం దర్శనానికి గంటల సమయం పడుతుంది. భక్తులు అధిక సంఖ్యలో రావడంతో తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు భక్తులకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశారు.

నిన్న తిరుమలకు...
ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని పదిహేను కంపార్ట్‌మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. సర్వదర్శనం క్యూ లైన్ లోకి టోకెన్లు లేకుండా ప్రవేశించే భక్తులకు శ్రీవారి దర్శనం పన్నెండు గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు చెప్పారు. నిన్న తిరుమల శ్రీవారిని 53,055 మంది మాత్రమే దర్శించుకున్నారు. వీరిలో 15,1567 మంది భక్తులు తలనీలాలను సమర్పించి మొక్కులు సమర్పించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.33 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది.


Tags:    

Similar News