Andhra Pradesh : ఏపీలో ఎన్నికల షెడ్యూల్ ఎప్పుడంటే?
ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు ఫిబ్రవరి మూడో వారంలో షెడ్యూల్ విడుదలయ్యే అవకాశముంది.
ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు ఫిబ్రవరి మూడో వారంలో షెడ్యూల్ విడుదలయ్యే అవకాశముంది. అంటే పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ముగిసిన వెంటనే షెడ్యూల్ విడుదల చేసేందుకు కేంద్ర ఎన్నికల కమిషన్ సన్నాహాలు చేస్తుంది. పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ఫిబ్రవరి 9వ తేదీతో ముగియనున్నాయి. దీంతో ఎన్నికల షెడ్యూల్ ఫిబ్రవరి పదోతేదీన ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశముందని అధికార వర్గాలు చెబుతున్నాయి.
ఏ ఫేజ్ లో అనేది...
2019 ఎన్నికల షెడ్యూల్ మార్చి 10వ తేదీన వచ్చింది. అంటే ఈసారి నెల రోజుల ముందుగానే ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశముందని చెబుతుున్నారు. దేశ వ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికలతో పాటు ఏపీతో పాటు మూడు రాష్ట్రాల్లో శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి. అంటే మార్చి నెలాఖరు లేదా? ఏప్రిల్ మొదటి వారంలో ఎన్నికలు జరిగే అవకాశముందని చెబుతున్నారు. నాలుగు అయిదు విడతలుగా ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. అయితే ఏ దశలో ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు నిర్వహిస్తారన్నది తేలాల్సి ఉంది. అయితే ఏప్రిల్ 16వ తేదీన ఏపీలో ఎన్నికలు నిర్వహిస్తారని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని కేంద్ర ఎన్నికల కమిషనర్ కొట్టిపారేశారు.