Tirumala : తిరుమల బ్రహ్మోత్సవాల షెడ్యూల్ ఇదే... ఆరోజు మాత్రం వాహనాల రాకపోకలపై ఆంక్షలు

తిరుమల బ్రహ్మోత్సవాల షెడ్యూల్ విడుదల అయింది. అక్టోబర్ 4 నుంచి 12వ తేదీ వరకు శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి.

Update: 2024-09-27 04:12 GMT

తిరుమలలో బ్రహ్మోత్సవాల షెడ్యూల్ విడుదల అయింది.అక్టోబర్ 4వ తేదీ నుంచి 12వ తేదీ వరకు శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఇందుకు సంబంధించి టీటీడీ భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేస్తుంది.అక్టోబర్ 4వతేదీ ఉదయం 5:45 గంటలకు ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి.ప్రతి రోజు ఉదయం 8 గంటలకు, సాయంత్రం 7 గంటలకు మాడ వీధుల్లో వాహనసేవలు ప్రారంభమవుతాయి. రోజూ ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నారని తిరుమ తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. 12న రాత్రి 10:30 గంటలకు ధ్వజారోహణంతో ఈ ఉత్సవాలు ముగియనున్నాయి.

అక్టోబరు 4 - ధ్వజారోహణం, పాద సేవ వాహనం
అక్టోబరు 5 - చిన్న శేష వాహనం, హంస వాహనం
అక్టోబరు 6 - సింహ వాహనం, ముత్యపు పందిరి వాహనం
అక్టోబరు 7 - కల్ప వృక్ష వాహనం, సర్వభూపాల వాహనం
అక్టోబరు 8 - మోహిని అవతార వాహనం, గరుడసేవ,
అక్టోబరు 9 - హనుమంత వాహనం, “బంగారు రథం”, గజవాహనం
అక్టోబరు 10 - సూర్యప్రభ వాహనం, చంద్రప్రభ వాహనం
అక్టోబరు 11 - రథోత్సవం, అశ్వ వాహనం
అక్టోబరు 12 - చక్రస్నానం, ధ్వజరోహణ
అయితే బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమలకు వచ్చే వాహనాలపై ఆంక్షలను విధించారు. అక్టోబరు 7వతేదీరాత్రి 11 గంటల నుంచి అక్టోబరు 8వ తేదీఅర్థరాత్రి వరకూ కొండమీదకు ద్విచక్రవాహనాలను అనుమతించరు. దీంతో పాటు బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం ప్రత్యేక దర్శనాలు, వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేసింది. భక్తులు ఇది గమనించాలని టీటీడీ అధికారులు కోరుతున్నారు.


Tags:    

Similar News