సీఎం ప్రత్యేక కార్యదర్శిగా జవహర్ రెడ్డి

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ అధికారి జవహర్ రెడ్డి నియమితులయ్యారు;

Update: 2022-02-28 07:31 GMT
jawahar reddy, ys  jagan, secratary, cmo
  • whatsapp icon

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ అధికారి జవహర్ రెడ్డి నియమితులయ్యారు. జవహర్ రెడ్డి నేడు పత్యేక ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలను స్వీకరించారు. జవహర్ రెడ్డి ప్రస్తుతం తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోగా ఉన్నారు. ఆయనను అక్కడి నుంచి ముఖ్యమంత్రి ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ప్రభుత్వం నియమించింది.

బాధ్యతల స్వీకరణ....
ఇటీవల ముఖ్యమంత్రి కార్యాలయంలో ఉన్న ప్రవీణ్ ప్రకాష్ ను ప్రభుత్వం బదిలీ చేసిన సంగతి తెలిసిందే. ఆయనను ఢిల్లీలోని ఏపీ భవన్ కు రెసిడెంట్ కమిషనర్ గా బదిలీ చేశారు. ఆయన స్థానంలో జవహర్ రెడ్డిని నియమిస్తారని ముందుగా ఊహించిందే. ఎన్నికల సమయంలో తనకు సరైన సలహాలు, సూచనలు ఇచ్చే అధికారులను జగన్ నియమించుకుంటున్నారు.


Tags:    

Similar News