ఇద్దరు ముఖ్యమంత్రులకు ముద్రగడ డిమాండ్ ఇదే
రెండు తెలుగు రాష్ట్రాలకు సీనియర్ నేత ముద్రగడ పద్మనాభం సూచనలు చేశారు. రైతులను ఆదుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు
రెండు తెలుగు రాష్ట్రాలకు సీనియర్ నేత ముద్రగడ పద్మనాభం సూచనలు చేశారు. రైతులను ఆదుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వాలు కొనుగోలు చేయాలని ముద్రగడ పద్మనాభం డిమాండ్ చేశారు. వరదలకు, భారీ వర్షాలకు రైతాంగం రెండు రాష్ట్రాల్లో తీవ్రంగా నష్టపోయిందని, వారిని ఆదుకునే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలపైనే ఉందని ముద్రగడ పేర్కొన్నారు.
ధాన్యం కొనుగోలుకు...
వరి వేయవద్దంటూ రైతులకు చెప్పడం సరికాదని ముద్రగడ అభిప్రాయపడ్డారు. తడిసిన ధాన్యాన్ని ఆల్కాహాల్ స్పిరిట్ కు ఉపయోగించవచ్చని చెప్పారు. జిల్లాకు ఆల్కాహాల్ స్పిరిట్ డిస్టిలరీని ఏర్పాటు చేయాలని ముద్రగడ పద్మనాభం కోరారు. రైతులను ఆదుకోకుంటే ప్రభుత్వాలపై నమ్మకం పోతుందని ముద్రగడ పద్మనాభం అన్నారు. తెలుగు రాష్ట్రాల్లో రైతుల వెన్నుముక విరిగిపోయిందన్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రులు జగన్, కేసీఆర్ కు ఆయన లేఖ రాశారు.