విజయమ్మ ఎందుకు మాట్లాడటం లేదు?
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుపై టీడీపీ సీనియర్ నేత నక్కా ఆనంద్ బాబు సంచలన వ్యాఖ్యలు చేశారు
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుపై టీడీపీ సీనియర్ నేత నక్కా ఆనంద్ బాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. సీబీఐ ద్వారా వెలుగు చూస్తున్న విషయాలపై విజయమ్మ, షర్మిల ఎందుకు మాట్లాడటం లేదని ఆయన ప్రశ్నించారు. జగన్ ను ముఖ్యమంత్రిని చేయడం కోసం ఊరూరా తిరిగిన విజయమ్మ, షర్మిల ఇప్పుడ మౌనంగా ఉండటంలో ఆంతర్యమేంటని నక్కా ఆనంద్ బాబు నిలదీశారు.
అంగీకరించినట్లేనా?
వారిద్దరి మౌనం వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో జగన్ ప్రమేయాన్ని అంగీకరిస్తున్నారన్న భావన ప్రజల్లో కలుగుతుందని నక్కా ఆనంద్ బాబు అభిప్రాయపడ్డారు. ఈ హత్య కేసులు సీబీఐ విచారణలో కీలక అంశాలను వెల్లడించిన దస్తగిరి, సునీత, ఆమె భర్త రాజశేఖర్ రెడ్డిలకు కేంద్ర ప్రభుత్వం రక్షణ కల్పించాలని నక్కా ఆనంద్ బాబు డిమాండ్ చేశారు.