వర్మ ను పట్టుకోలేకపోతున్నారా?
సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పోలీసులకు చిక్కడం లేదు. పోలీసులు కన్నుగప్పి తప్పించుకుని ఆయన తిరుగుతున్నారు.;
సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పోలీసులకు చిక్కడం లేదు. పోలీసులు కన్నుగప్పి తప్పించుకుని ఆయన తిరుగుతున్నారు. మరోవైపు వీడియోలను కూడా ప్రతి రోజూ విడుదల చేస్తున్నారు. రాజకీయ కక్ష సాధింపు చర్యల కోసమే తనపై అక్రమ కేసులు పెట్టారని, తాను సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వారు కాకుండా ఇతరులు పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తుతున్నారు.
ముందస్తు బెయిల్ పై...
మరోవైపు నేడు ఏపీ హైకోర్టులో రామ్ గోపాల్ వర్మ ముందస్తు బెయిల్ పై విచారణ జరగనుంది. వరసగా రెండు రోజుల పాటు వర్మ ముందస్తు బెయిల్ పిటీషన్ విచారణ జరగలేదు. నేటికి వాయిదా పడింది. ఇప్పటికే మద్దిపాడు పోలీసులు రామ్ గోపాల్ వర్మ కోసం తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో వెదుకుతున్నా ఫలితం కనిపించడం లేదు.