నడక మార్గంలో ఎలుగుబంటి

తిరుమల అలిపిరి నడక మార్గంలో ఎలుగుబంటి తిరుగాడటాన్ని కొందరు గుర్తించారు.

Update: 2023-09-20 07:03 GMT

తిరుమల నడక మార్గంలో వన్య ప్రాణుల సంచారం ఆగడం లేదు. అలిపిరి నడక మార్గంలో ఎలుగుబంటి తిరుగాడటాన్ని కొందరు గుర్తించారు. సీసీ టీవీల్లో కూడా ఇది రికార్డయింది. దీంతో భక్తులు భయపడిపోతున్నారు. అలిపిరి నడకమార్గంలోని నరసింహస్వామి ఆలయం వద్ద అర్థరాత్రి ఎలుగుబంటి సంచరించినట్లు సీసీటీవీ ఫుటేజీలో కనుగొన్నారు.

అర్థరాత్రి...
అయితే ఆ సమయంలో భక్తులు ఎవరూ నడక మార్గంలో రాకపోతుండటంతో పెద్ద ప్రమాదం తప్పింది. రాత్రి పదకొండు సమయంలో ఎలుగుబంటి నడకమార్గంలోకి వచ్చి కాసేపు అక్కడే ఉండి వెళ్లిపోయింది. రాత్రివేళ భక్తుల రాకపోకలు ఉండవు కాబట్టి పెద్ద ప్రమాదం తప్పిందని అధికారులు కూడా ఊపిరి పీల్చుకున్నారు. నిన్ననే ఒక చిరుత నడక మార్గంలో అటవీశాఖ అధికారులు ఏర్పాటు చేసిన బోనులో చిక్కుకుంది. తాజాగా ఎలుగు బంటి సంచారంతో భక్తులు భీతిల్లిపోతున్నారు.


Tags:    

Similar News