చల్లబడిన తెలుగు రాష్ట్రాలు

నైరుతి రుతు పవనాలు తెలుగు రాష్ట్రాల్లోకి ప్రవేశించాయి. నెమ్మదిగా విస్తరిస్తున్నాయని వాతావారణశాఖ అధికారులు చెబుతున్నారు

Update: 2022-06-15 03:22 GMT

నైరుతి రుతు పవనాలు రెండు తెలుగు రాష్ట్రాల్లోకి ప్రవేశించాయి. రుతుపవనాలను నెమ్మదిగా విస్తరిస్తున్నాయని వాతావారణశాఖ అధికారులు చెబుతున్నారు. రెండు, మూడు రోజుల్లో రాయలసీమలోని కొన్ని ప్రాంతాలకు, నాలుగైదు రోజుల్లో కోస్తాంధ్రలోకి ప్రవేశిస్తాయని తెలిపారు. ఇప్పిటికే కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గాయి. కోస్తా జిల్లాల్లో మాత్రం ఇంకా ఎండల తీవ్రత కొనసాగుతుంది. మరో నాలుగైదు రోజుల్లో కోస్తాంధ్రలోకి కూడా నైరుతి రుతుపవనాలు ప్రవేశిస్తాయని వాతావవరణ శాఖ అధికారులు చెబుతున్నారు.

భారీ వర్షాలు...
అక్కడక్కడ భారీ వర్షాలు కురేసే అవకాశముంది. తెలంగాణ లోకి కూడా రుతు పవనాలు ప్రవేశించాయి. ఇప్పటికే కొన్నిచోట్ల వర్షాలు కురుస్తున్నాయి. ఈరోజు, రేపు భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. ప్రధానంగా హైదరాబాద్ లో భారీ వర్షాలు కురుస్తాయని చెప్పడంతో జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు.


Tags:    

Similar News