Breaking : టీడీపీ సభ్యుల సస్పెన్షన్
ఆంధ్రప్రదేశ్ శాసనసభ నుంచి తెలుగుదేశం పార్టీ సభ్యులను స్పీకర్ సస్పెండ్ చేశారు
ఆంధ్రప్రదేశ్ శాసనసభ నుంచి తెలుగుదేశం పార్టీ సభ్యులను స్పీకర్ సస్పెండ్ చేశారు. ఒకరోజు పాటు టీడీపీ సభ్యులను సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. పది మంది సభ్యులను సస్పెండ్ చేస్తూ స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు. అసెంబ్లీ ప్రారంభం కాగానే టీడీపీ సభ్యులు ఆందోళనకు దిగారు. అసెంబ్లీలో దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ నినాదాలు చేశారు.
నినాదాలతో...
దీంతో పాటు జీవో నెంబరు వన్ ను రద్దు చేయాలంటూ నినాదాలు చేశారు. సభ ప్రారంభం కాగానే టీడీపీ సభ్యులు వెల్ లోకి దూసుకెళ్లడంతో స్పీకర్ సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే స్పీకర్ పోడియం వద్ద రెడ్ లైన్ ను ఏర్పాటు చేశారు. ఈమేరకు రూలింగ్ ఇచ్చారు. అది దాటి వచ్చిన వారందరినీ సస్పెండ్ చేసినట్లు ప్రకటించారు. దీంతో నినాదాలు చేస్తూ బయటకు వెళ్లిపోయారు.