Breaking : గంటా శ్రీనివాసరావు రాజీనామా ఆమోదం.. అందుకేనట
మాజీ మంత్రి గంటా శ్రీనవివాసరావు రాజీనామాను స్పీకర్ తమ్మినేని సీతారాం ఆమోదించారు
మాజీ మంత్రి గంటా శ్రీనవివాసరావు రాజీనామాను స్పీకర్ తమ్మినేని సీతారాం ఆమోదించారు. ఆయన రాజీనామాను ఆమోదించినట్లు స్పీకర్ కార్యాలయం వెల్లడించింది. రెండేళ్ల క్రితం ఆయన తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ కు కేంద్ర ప్రభుత్వం సిద్ధపడటంతో ఆయన తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. అయితే రెండేళ్ల నుంచి ఆయన రాజీనామాను స్పీకర్ తమ్మినేని సీతారాం ఆమోదించలేదు. ఈరోజు ఆమోదించారు.
రెండేళ్ల నుంచి...
విశాఖపట్నం ఉత్తర నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో ఆయన వైసీపీ అభ్యర్థిపై స్వల్ప మెజారిటీతో గెలుపొందారు. ఆ తర్వాత విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా కార్మికులు చేస్తున్న పోరాటానికి మద్దతుగా గంటా శ్రీనివాసరావు రాజీనామా చేశారు. అయితే రాజ్యసభ ఎన్నికలు సమీపిస్తుండటంతో ఆయన రాజీనామాను ఇప్పుడు ఆమోదించారని టీడీపీ చెబుతుంది. రెండేళ్ల నుంచి రాజీనామాను పక్కన పెట్టి ఇప్పుడే ఎందుకు ఆమోదించారో అందరికీ తెలుసునని అన్నారు. త్వరలో ఏపీ రాజ్యసభ ఎన్నికలు జరుగుతుండటంతో ఆయన ఓటు వేయడానికి వీలు లేకుండా రాజీనామాను ఆమోదించినట్లు ప్రత్యర్థులు ఆమోదించారు.