స్పీకర్ సంచలన నిర్ణయం.. అసెంబ్లీలో ఇకపై?

ఆంధ్రప్రదేశ్ స్పీకర్ తమ్మినేని సీతారాం సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇకపై శాసనసభలో సెల్ ఫోన్లు వినియోగించవద్దని సూచించారు.

Update: 2021-11-26 08:08 GMT

ఆంధ్రప్రదేశ్ స్పీకర్ తమ్మినేని సీతారాం సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇకపై శాసనసభలో సెల్ ఫోన్లు వినియోగించవద్దని సూచించారు. సభలోకి సెల్ ఫోన్లు తీసుకు రావద్దని, వాటిని బయటకు తీయవద్దని స్పీకర్ పేర్కొన్నారు. ఇటీవల అసెంబ్లీలో జరిగిన పరిణామాల దృష్ట్యా స్పీకర్ తమ్మినేని సీతారాం ఈ నిర్ణయం తీసుకున్నారు.

సామాజిక మాధ్యమాల్లో....
మొన్న అసెంబ్లీలో వైసీపీ, టీడీపీ సభ్యుల మధ్య వాగ్వాదాన్ని కొందరు సెల్ ఫోన్లలో చిత్రీకరించారు. తర్వాత వివిధ సామాజిక మాధ్యమాల నుంచి విడుదల చేశారు. ఇది శాసనసభ నిబంధనలకు విరుద్ధమని స్పీకర్ పేర్కొన్నారు. రికార్డులోకి రాని వ్యాఖ్యలను బయటకు విడుదల చేయడం నేరమన్నారు. ఇకపై శాసనసభలో సెల్ ఫోన్ల వాడకాన్ని నిషేధిస్తూ స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు.


Tags:    

Similar News