Breaking: టీడీపీ సభ్యుల సస్పెన్షన్

ఐదో రోజు కూడా టీడీపీ సభ్యులను స్పీకర్ తమ్మినేని సీతారాం సస్పెండ్ చేశారు.11 మంది టీడీపీ సభ్యులను స్పీకర్ సస్పెండ్ చేశారు

Update: 2023-03-19 06:44 GMT

ఐదో రోజు కూడా తెలుగుదేశం పార్టీ సభ్యులను స్పీకర్ తమ్మినేని సీతారాం సస్పెండ్ చేశారు. పదకొండు మంది టీడీపీ సభ్యులను స్పీకర్ సస్పెండ్ చేశారు. ఒక రోజు పాటు సస్పెండ్ చేసినట్లు స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రకటించారు. సమావేశాలు ఆదివారం ప్రారంభం కాగానే పెంచిన విద్యుత్తు ఛార్జీలను తగ్గించాలంటూ టీడీపీ సభ్యులు ఆందోళనకు దిగారు. స్పీకర్ పోడియంను చుట్టుముట్టి విద్యుత్తు ఛార్జీలపై చర్చకు అనుమతించాలని నినాదాలు చేశారు.

విద్యుత్తు ఛార్జీలపై...
అయితే స్పీకర్ తమ్మినేని సీతారాం పదే పదే తమ సీట్లలో కూర్చోవాలని హెచ్చరించినా ఫలితం లేదు. ప్లకార్డులతో నిరసనకు దిగడంతో పలుమార్లు చెప్పినా వినలేదు. వ్యవసాయ మోటార్లు బిగింపుపై చర్చకు తెలుగుదేశ పార్టీ సభ్యులు పట్టుబట్టారు. ఎంత చెప్పినా వినకపోవడంతో స్పీకర్ తమ్మినేని సీతారాం ఒక రోజు టీడీపీ సభ్యులను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు.


Tags:    

Similar News