Ys Jagan : జగన్ పై దాడి ఘటనపై సిట్ ఏర్పాటు

వైసీపీ అధినేత జగన్ పై నిన్న జరిగిన దాడి ఘటనపై స్పెషల్ ఇన్విస్టిగేషన్ టీం ఏర్పాటయింది

Update: 2024-04-14 12:09 GMT

వైసీపీ అధినేత జగన్ పై నిన్న జరిగిన దాడి ఘటనపై స్పెషల్ ఇన్విస్టిగేషన్ టీం ఏర్పాటయింది. ఈ మేరకు విజయవాడ పోలీస్ కమిషనర్ క్రాంతి రాణా సిట్ ను ఏర్పాటు చేశారు. ఎస్పీ స్థాయి అధికారి నేతృత్వంలో స్పెషల్ ఇన్విస్టిగేషన్ టీం ఏర్పాటయింది. ఇప్పటికే ఆరు టీంలు జగన్ పై దాడి విషయంలో విచారణను చేపట్టాయి.

సెల్ ఫోన్ టవర్స్ నుంచి...
దీంతో పాటు స్పెషల్ ఇన్విస్టిగేషన్ టీం కూడా విచారణ చేపట్టనుంది. వీలయినంత త్వరగా నివేదిక ఇవ్వాలని సిట్ కు ఆదేశాలు అందాయి. మరోవైపు అజిత్ సింగ్ నగర్ లో మూడు సెల్ ఫోన్ టవర్స్ డేటాను స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. ఆ ప్రాంతంలో దాదాపు ఇరవై వేల ఫోన్లు యాక్టివ్ గా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. దీంతో అక్కడ ఉన్న సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. అనుమానాస్పద వ్యక్తులు ఎవరైనా వచ్చారా? అన్న దానిపై స్థానికులను అడిగి తెలుసుకుంటున్నారు.


Tags:    

Similar News